ETV Bharat / city

నేడు పాఠశాలలకు సెలవు - వర్షంతో పాఠశాలలకు సెలవులు

అల్పపీడనం ప్రభావంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపిలేని వానలు పడుతున్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయం అయ్యాయి. వాతావరణశాఖ సమాచారం ప్రకారం గురువారం భారీగా వానలు పడే అవకాశం ఉన్నందున విశాఖ, విజయనగరం జిల్లాల కలెక్టర్లు అప్రమత్తం అయ్యారు. నేడు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

రేపు పాఠశాలలకు సెలవు
author img

By

Published : Oct 23, 2019, 11:49 PM IST

Updated : Oct 24, 2019, 1:12 AM IST

ఇదీ చదవండి :

Intro:విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ౦లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభి౦చి౦ది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాండవ నది లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని తాండవ పరివాహక ప్రాంత వాసులకు సూచించారు. కొండ గెడ్డలు పంట పొలాల్లోకి వరదనీరు చేరి మునిగి పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. య. స్ రాయవరం, అరట్ల కోట గ్రామాల్లో చెట్లు నేల కూలయీ. పాల్తేరు, మంగవరం లో ఇళ్ల లోకి వర్షం చేరి గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు.Body:HkConclusion:Bk
Last Updated : Oct 24, 2019, 1:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.