ETV Bharat / city

విశాఖ నగరమంతా తీరం వైపు, జీవీఎంసీ పిలుపునకు భారీ స్పందన

Visakha Beach: సమద్రంలోకి వచ్చే వ్యర్ధాలతో జలచర జీవుల మనుగడ ప్రమాదంగా మారింది. నిరంతరం సముద్ర తీరానికి వచ్చే సందర్శకులతో పాటూ, ఆయా ప్రాంతాల్లో వివిధ వాణిజ్య, వ్యాపార సంస్థలు సైతం ప్లాస్టిక్​ని తీరంవైపుగా వదలడంతో తీర ప్రాంతం అంతా ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిపోయింది. పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగిండానికి జీవీఎంసి పిలుపు ఇచ్చింది. దాంతో నగర వాసులు, యువతతోపాటు డాల్ఫిన్ హోటల్ ఉద్యోగులు, వివిధ వాణిజ్య సంస్థల ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Visakha Beach Cleanup Program
జీవిఎంసి పిలుపుకు భారీ స్పందన
author img

By

Published : Aug 26, 2022, 3:02 PM IST

Visakha Beach cleaning: విశాఖలో సముద్ర తీర శుభ్రత కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గోకుల్ పార్క్ తీరం నుంచి భీమిలి సాగర తీరం వరకు 28 కిలోమీటర్ల పరిధిలో 40 ప్రాంతాల్లో జీవీఎంసీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునివ్వడంతో నగర వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా డాల్ఫిన్ హోటల్ సిబ్బంది సముద్ర తీర శుభ్రత కార్యక్రమంలో పాల్గొని తీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించారు. ప్లాస్టిక్ రహిత సామగ్రి వినియోగం, స్వచ్ఛభారత్ కార్యక్రమాలలో తమ హోటల్ ఎల్లప్పుడూ ముందుంటుందని డాల్ఫిన్ హోటల్ మేనేజర్ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.