ETV Bharat / city

'విశాఖలో వైకాపా భూకుంభకోణం... కోట్లలో దందా'

విశాఖపట్నంలో వైకాపా నేతలు భూకుంభకోణం చేస్తున్నారని తెదేపా నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు విశాఖలో 6 వేల ఎకరాలు కొన్నారని ఉమా చెప్పారు.

author img

By

Published : Dec 20, 2019, 9:22 PM IST

Devineni uma
దేవినేని ఉమామహేశ్వరరావు
మీడియాతో మాట్లాడుతున్న దేవినేని ఉమ

విశాఖ కేంద్రంగా వైకాపా భూకుంభకోణానికి పాల్పడుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఓ మత సంస్థకు చెందిన 3.5 ఎకరాలపై మూడేళ్లుగా వివాదం నడుస్తోందన్న ఆయన... ఈ వివాదంలోకి సీఎం జగన్ బినామిలు ప్రవేశించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో రూ.50 కోట్లు చేతులు మారాయని చెప్పారు. ఆ సంస్థకు చెందిన మొత్తం వెయ్యి కోట్ల ఆస్తులు, నెల్లకుండిల జంక్షన్ వద్ద 100 ఎకరాలు, సిరిపురం జంక్షన్ వద్ద 100 ఎకరాల్లో వైకాపా నాయకులు లే ఔట్లు వేశారని అన్నారు.

భీమిలి వద్ద 3 ఎకరాల్లో ముఖ్యమంత్రి నివాసం ఏర్పాటు చేసేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారని ఉమా మరో ఆరోపణ చేశారు. భూ కుంభకోణంలో.. సీఎం జగన్​కు సన్నిహితుడైన ఆడిటర్ కీలకపాత్ర పోషించారని విమర్శించారు. సేవ్ విశాఖపట్నం అని ప్రజలు నినదిస్తున్నారన్న ఉమామహేశ్వరరావు... విశాఖలో వైకాపా నాయకులు సుమారు 6 వేల ఎకరాలు కొన్నారని మంగళగిరి తెదేపా కార్యాలయంలో వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

'మీ ఇష్టమొచ్చినట్లు రాజధానిని మారుస్తారా?'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.