ETV Bharat / city

ఫుట్​బాల్​ టోర్నమెంట్ విజేతగా 'గణేష్ క్లబ్' టీమ్​ - ఫుట్​బాల్​ టోర్నమెంట్​ విజేతకు విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బహుమతి ప్రధానం

ఆంధ్ర విశ్వవిద్యాలయ మైదానంలో రెండు రోజులుగా జరుగుతున్న ఫుట్​బాల్​ టోర్నమెంట్​లో 'గణేష్ క్లబ్' టీమ్​ విజేతగా నిలిచింది. పైడా విద్యా సంస్థల అధినేత, రాష్ట్ర రెల్లి కార్పొరేషన్ ఛైర్మన్లు​ బహుమతి ప్రదానం చేశారు.

prize distribution to winning team
విజయం సాధించిన జట్టుకు బహుమతి అందజేత
author img

By

Published : Nov 15, 2020, 9:23 PM IST

విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్, విజయ దుర్గ స్పోర్టింగ్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఫుట్​బాల్​ టోర్నమెంట్​లో 'గణేష్ క్లబ్' విజయం సాధించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో.. 18 జట్లు పాల్గొన్నాయి. డాన్ క్లబ్ జట్టుతో హోరాహోరీగా సాగిన తుదిపోరులో.. 'గణేష్ క్లబ్' విజేతగా నిలిచింది.

పైడా విద్యా సంస్థల అధినేత కృష్ణ ప్రసాద్, రాష్ట్ర రెల్లి కార్పొరేషన్ ఛైర్మన్ మధుసూదన్​లు విజేతకు బహుమతి అందజేశారు. నగరంలో క్రీడాభివృద్ధికి స్వచ్ఛంద సంస్థల కృషి కీలకమని అతిధులు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టోర్నమెంట్ నిర్వహించినందుకు నిర్వహకులను ప్రశంసించారు.

ఇదీ చదవండి: విశాఖలో తీవ్ర కాలుష్యాన్ని వెదజల్లిన టపాసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.