క్రెడాయ్ విశాఖపట్నం ఛాప్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన రక్త దాన శిబిరాన్ని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రారంభించారు. కొవిడ్ మహమ్మారి ప్రభావంతో రక్త నిల్వల కొరత ఏర్పడిందని క్రెడాయ్ అధ్యక్షులు శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమస్యను అధిగమించే దిశగా ముందుకు వచ్చి స్థిరాస్తి, నిర్మాణ రంగంలో ఉన్న వారితో పాటు చాలా మంది రక్త దానం చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ప్రతి ఒక్కరు రక్తదాతలుగా మారి.. నిల్వల కొరతను అధిగమించేందుకు సహకరించాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
క్రెడాయ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. - విశాఖ తాజా వార్తలు
విశాఖలో క్రెడాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రారంభించారు. కొవిడ్ కారణంగా రక్త నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయని క్రెడాయ్ అధ్యక్షులు శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలోని స్థిరాస్తి, నిర్మాణ రంగాల్లో పనిచేసే వారు రక్తదానం కోసం ముందుకు రావడాన్ని ఆయన కొనియాడారు.
క్రెడాయ్ విశాఖపట్నం ఛాప్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన రక్త దాన శిబిరాన్ని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రారంభించారు. కొవిడ్ మహమ్మారి ప్రభావంతో రక్త నిల్వల కొరత ఏర్పడిందని క్రెడాయ్ అధ్యక్షులు శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమస్యను అధిగమించే దిశగా ముందుకు వచ్చి స్థిరాస్తి, నిర్మాణ రంగంలో ఉన్న వారితో పాటు చాలా మంది రక్త దానం చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ప్రతి ఒక్కరు రక్తదాతలుగా మారి.. నిల్వల కొరతను అధిగమించేందుకు సహకరించాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: విశాఖలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు