ఆంధ్రుల మనోభావాలతో ముడిపడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌ను ఎవరూ కొనకపోతే మూసివేస్తామంటున్న ప్రధాని మోదీ సర్కారును కూడా అదే తరహాలో ప్రజలు మూసివేస్తారని హెచ్చరించారు.
ఎటువంటి ప్రయోజనం లేకుండా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. రైతుల ఆందోళన, విశాఖ, అమరావతి ఉద్యమాలను కేంద్రం పట్టించుకోవట్లేదని చెప్పారు. రాజధాని అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం న్యాయం చేయాలన్నారు. స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేక గనులు కేటాయించినా.. కేంద్రమే నడపాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
రిజిస్ట్రేషన్ ఉండదు.. ఏ రీచ్ నుంచైనా ఇసుక తీసుకెళ్లవచ్చు: జి.కె. ద్వివేది