అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా 'మార్పు' కేంద్రాన్ని విశాఖ నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా(CP Manish Kumar Sinha visit marpu center) పరిశీలించారు. నగరంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో పోలీసులు, వైద్యులు, నిపుణుల ఆధ్వర్యంలో 7 నెలల క్రితం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 280పైగా మంది పైగా కౌన్సిలింగ్ పొందారని వెల్లడించారు. ముఖ్యంగా మద్యం, మాదకద్రవ్యాలు, చెడు వ్యసనాలకు బానిసలైన వారికి ఉచితంగా కౌన్సిలింగ్ ఇచ్చి.. అవసరమైతే డీ ఎడిక్షన్ కేంద్రాలకు పంపిస్తామని సీపీ తెలిపారు.
చెడు వ్యాసనాల బారి నుంచి విముక్తి పొందాలనుకునేవారు నేరుగా ఈ కేంద్రాన్ని ఆశ్రయించవచ్చునని.. తద్వారా వారి జీవితంలో నూతన మార్పుకు నాంది అని సీపీ(CP Manish Kumar Sinha) ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శాంతి భద్రతల డీసీపీ గౌతమి సాలి, అడ్మిన్ ఏడీసీపీ రజని, ఏసీపీ శ్రావణ్ కుమార్, గ్రీన్ వ్యాలీ డీ ఎడిక్షన్ సెంటర్ నిర్వహకురాలు ఉమారాజ్ పాల్గొన్నారు.
CARGO SERVICES: విశాఖలో విమాన కార్గో సేవలు రద్దు.. కారణం ఇదే!