విశాఖ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని 'కొబ్బరితోట' ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, శాంతిభద్రతల డీసీపీ రంగారెడ్డి ఆదేశాల మేరకు... కొబ్బరితోటలోని ప్రతి ఇంటిని పోలీసులు జల్లెడపట్టారు. ఏయే ఇంటిలో ఎంతమంది నివసిస్తున్నారు, ఏయే పనులు చేస్తున్నారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పదంగా సమాధానాలు చెప్పినవారిని, పాతనేరస్తులను కలిపి...సుమారు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. అధిక సంఖ్యలో ద్విచక్రవాహనాలు ఈ ప్రాంతంలో ఉండడంపై ఆరా తీశారు. సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: