కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో విశాఖ రుషికొండ బీచ్‌కు సందర్శకులు పెద్దగా రాకపోవడంతో స్పీడ్ పడవల ద్వారా పర్యటక శాఖకు సమకూరే ఆదాయం ఊహించని స్థాయిలో గణనీయంగా తగ్గింది. గతంలో శని, ఆదివారాలు, ఇతరత్రా సెలవు దినాల్లో ఒక్కోరోజుకు రూ.60 వేలు నుంచి రూ.70 వేలు వసూలయ్యేదని.. ఈనెల 24, 25 తేదీల్లో శని, ఆదివారాలు రెండు రోజులు కలుపుకొని కేవలం రూ.8 వేలు మాత్రమే వచ్చిందని అధికారులు పేర్కొన్నారు.
గతంలో మిగిలిన సాధారణ దినాల్లో ప్రతిరోజూ రూ.20 వేలకు పైబడి సమకూరేదని.. ఇటీవల నుంచి రోజువారీ చూస్తే రూ.వెయ్యి రావడం గగనమవుతోందని అధికారులు పేర్కొన్నారు. తాజాగా మంగళవారం రూ.600 మాత్రమే వచ్చిందన్నారు.
ఇదీ చదవండి