కరోనా వైరస్‌పై విశాఖ రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రయాణికులు చేతులు శుభ్రపరుచుకునే వస్తువులు అందుబాటులో ఉంచారు. ఏసీ రైళ్లల్లో కిటికీలకు ఉండే తెరలను తొలగించారు. దుప్పట్లను ఇవ్వడం నిలిపేశారు. రైల్వే సిబ్బంది మాస్క్‌లతో విధులు నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు విశాఖ రైల్వే ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ డీఆర్ఎం శ్రీవాస్తవ చెప్పారు. ప్రయాణికులు వ్యకిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. మరోవైపు ప్రయాణికులకు ఎప్పటికప్పుడు థర్మల్ పరీక్షలు చేస్తున్నట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ సునీల్ కుమార్ తెలిపారు. ప్రయాణికుల సంఖ్య తగ్గిందని చెబుతున్నారు.
ఇదీ చూడండి: