ETV Bharat / city

విశాఖ చెస్ట్​ ఆస్పత్రి వీడియో వైరల్: నిజం కాదన్న కలెక్టర్

విశాఖలోని కరోనా కేసుల పరీక్ష కోసం నిర్దేశించిన ఛాతి ఆస్పత్రిలో సౌకర్యాల లేమి ఉందని సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అవుతోంది. ఆస్పత్రికి పరీక్ష కోసం వచ్చిన ఓ వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో పెట్టడం కలకలం రేపింది.

collector-on-chest-hospital-facilities-in-vishaka

author img

By

Published : Mar 27, 2020, 9:06 PM IST

విశాఖలోని కరోనా కేసుల పరీక్ష కోసం కేటాయించిన ఛాతి ఆస్పత్రిలో సౌకర్యాల లేమి కనిపిస్తోంది. అక్కడికి పరీక్ష కోసం వచ్చిన ఓ వ్యక్తి వీడియోని తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఆ పరీక్ష కేంద్రంలో ఎవరూ లేకపోవడం, అత్యవసరమైనప్పుడు పనిచేసే సిబ్బంది లేని వైనం ఆ వీడియోలో కనిపిస్తోంది. అనుమానితుల నుంచి పరీక్షల కోసం రక్తాన్ని సేకరించిన తర్వాత.. ఆ సిరంజిలను కూడా అలానే వదిలేస్తున్నారు. అక్కడ రోగులకు సరఫరా చేసిన ఆహారం ఏ స్థితిలో ఉందో కళ్లకు కట్టినట్లు ఈ వీడియోలో ఉంది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోపై జిల్లా కలెక్టర్‌ విజయ్ చంద్ స్పందించారు.

విశాఖ ఆస్పత్రిలో సౌకర్యాల లేమి అంటూ వీడియో వైరల్: నిజం కాదన్న కలెక్టర్

ఛాతి ఆస్పత్రిలో కేవలం అనుమానితుల కేసులు మాత్రమే పరీక్షకు వస్తాయని..వీడియోలో చూపించిన వార్డు అసలు దానికి సంబంధించిన వార్డు కాదని కలెక్టర్‌ తెలిపారు. అయితే ఏదైనా లోపాలు ఉంటే కచ్చితంగా సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఇవీ చదవండి: తెలంగాణ: కరోనా రోగులను తరలించాక అంబులెన్స్​ సిబ్బంది ఏం చేస్తారో తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.