విశాఖలో జరుగుతున్న పూర్వ విద్యార్థుల సదస్సుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. జీఎంఆర్ సాయంతో నిర్మిస్తున్న వసతి గృహానికి శంకుస్థాపన చేశారు. ప్రపంచానికి గొప్ప మేధావులను అందించిన చరిత్ర ఏయూకి ఉందని పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరెడ్డిని చూపించారు. దేశంలో ప్రస్తుతం 14వ స్థానంలో ఉన్న ఏయూ... తొలి 5 స్థానాల్లో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న బోధనా సిబ్బంది కొరతతో ఏయూ ముందడుగు వేయలేకపోతుందన్నారు. ఇన్ని స్థానాలు ఖాళీగా ఉండటం ప్రభుత్వం తలదించుకునే అంశమని వ్యాఖ్యానించారు.
'ప్రపంచానికి ఏయూ గొప్ప మేధావులను అందించింది'
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సీఎం జగన్ పాల్గొన్నారు. భవిష్యత్లో ఏయూ దేశంలోని తొలి 5 స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు.