అంతర్జాలం వేదికగా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీసులతో కలిసి విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరంలో.. ఏక కాలంలో సీఐడీ సైబర్ విభాగ అధికారులు దాడులు నిర్వహించారు. విశాఖలోని ఓ స్టార్ హోటల్‌పై దాడి చేసి.. ప్రధాన నిందితుడు సంతోష్‌తో పాటు కోల్‌కతాకు చెందిన ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఇతర నిందితులు పవన్, క్రాంతిలు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
అంతర్జాలం ద్వారా కోల్‌కతా యువతులను విశాఖకు రప్పించి.. ఈ నిందితులు విటులను ఆకర్షిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో సంతోష్‌తో పాటు కోల్‌కతాకు చెందిన ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఉన్నారన్నారు. విశాఖ వాసులు పవన్, క్రాంతిలు వారితో కలిసి.. ఈ దందాను నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: