పార్టీ ముఖ్య నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ గ్యాస్ ఘటన, లాక్డౌన్ వేళ పేదల కష్టాలపై ప్రధానంగా చర్చించారు. గ్యాస్ లీకేజ్ ఘటన బాధితులకు అండగా ఉన్న తెదేపా, తదితర పక్షాల నేతలపై తప్పుడు కేసులు పెట్టడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. కోటి రూపాయలు వద్దు.. కూతురే కావాలనే తల్లిపై కేసులు పెట్టడం కన్నా అమానుషం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టడం వైకాపా నేతలకు అలవాటు అయిందన్నారు . తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటూ..బాధిత ప్రజలకు అండగా ఉండాలని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
విశాఖను పట్టుకుని వేలాడే ఎంపీ విజయసాయిరెడ్డి..గ్యాస్ లీకేజ్ ఘటన తర్వాత ఎక్కడ దాక్కున్నాడో అనే ప్రచారం జరుగుతుందని నేతలు చంద్రబాబుకు తెలిపారు. ఎల్టీ పాలిమర్స్, భారతి పాలిమర్స్, నందిని పాలిమర్స్‌కు మధ్య ఉన్న వ్యాపార లావాదేవీలపైన చర్చ జరుగుతుందని నేతలు అధినేత దృష్టికి తీసుకెళ్లారు. ఎల్జీ పాలిమర్స్ నుంచి విజయసాయిరెడ్డి ట్రస్ట్‌కు విరాళాలు అందాయనే ప్రచారం జరుగుతుందని చెప్పారు. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరగాల్సి ఉందని నేతలు వివరించారు.
ఇదీ చదవండి :