ETV Bharat / city

Vishaka Port: విశాఖ పోర్టు ఈ సారి ఆ లక్ష్యాన్ని చేరుకుంటుంది: కేంద్రమంత్రి శాంతను - విశాఖ పోర్టుపై కేంద్రమంత్రి శాంతను కామెంట్స్

విశాఖ పోర్టులో (Vishaka Port) క్రూయిజ్ టెర్మినల్ పనులు వచ్చే ఏడాదికి పూర్తయ్యే అవకాశం ఉందని కేంద్ర నౌకాయానశాఖ సహాయమంత్రి శాంతను ఠాకూర్ (Central Minister Shantanu Thakur) అన్నారు. విశాఖ పోర్టు 75 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ లక్ష్యాన్ని ఈ సారి చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

విశాఖ పోర్టు ఈ సారి ఆ లక్ష్యాన్ని చేరుకుంటుంది

author img

By

Published : Sep 24, 2021, 4:50 PM IST

అప్పన్న సేవలో కేంద్ర మంత్రి శాతను ఠాకూర్

విశాఖ పోర్టు (Vishaka Port) 75 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ లక్ష్యాన్ని ఈ సారి చేరుకుంటుందని నౌకాయానశాఖ సహాయమంత్రి శాంతను ఠాకూర్ (Central Minister Shantanu Thakur) ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం విశాఖకు వచ్చిన ఆయన.. పోర్టు పనితీరుపై సమీక్షించారు. మేజర్ పోర్టుల ప్రైవేటీకరణపై (Privatization of Major Ports) మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడగ్గా...ప్రస్తుతం ఆ చర్యలేవీ లేవన్నారు. స్వచ్ఛ పక్వడాలో (Swachhta Pakwada) పాల్గొన్న కేంద్ర మంత్రి...పోర్టు పరిపాలనా భవన ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రస్తుతం ఏడు పీపీపీ ప్రాజెక్టులు (PPP projects) పోర్టులో నడుస్తున్నాయని మంత్రి వివరించారు. క్రూయిజ్ టెర్మినల్ పనులు వచ్చే ఏడాదికిపూర్తయ్యే అవకాశం ఉందన్నారు.

సమీక్ష అనంతరం శాంతను ఠాకూర్ సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దర్శనం కల్పించి..,వేదాశీర్వాదం చేయించారు. 'ఇంత అద్భుతమైన ఆలయాన్ని నేనెప్పుడూ చూడలేదు' అని శాంతాను ఠాకూర్ విజిటర్స్ బుక్​లో రాశారు. మంత్రితో పాటు వచ్చిన స్థానిక భాజపా నేతలు ఆలయ విశిష్టతను ఆయనకు వివరించారు.

ఇదీ చదవండి: CM Jagan: వైద్యారోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష.. రాత్రి కర్ఫ్యూపై కీలక నిర్ణయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.