ETV Bharat / city

డాక్టర్​ సుధాకర్​ కేసులో సీబీఐ విచారణ వేగవంతం - మత్తు డాక్టర్​ సుధాకర్​ కేసులో సీబీఐ విచారణ వార్తలు

వైద్యుడు సుధాకర్ వ్యవహారంలో సీబీఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. సోమవారం సీబీఐ అధికారులు వివిధ కోణాల్లో విచారణ జరిపారు. సుధాకర్ కుటుంబ సభ్యుల నుంచి సమాచారం తీసుకోవడం సహా ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. 4వ పట్టణ పోలీసు స్టేషన్​ను పరిశీలించి... అక్కడి అధికారులను సైతం విచారించారు.

వైద్యుడు సుధాకర్​ పెద్ద కుమారుణ్ని ప్రశ్నించిన సీబీఐ

author img

By

Published : Jun 1, 2020, 7:25 PM IST

Updated : Jun 2, 2020, 3:21 AM IST

విశాఖలో డాక్టర్ సుధాకర్ విషయంలో సీబీఐ దర్యాప్తు వేగవంతమైంది. ఓ వైపు సుధాకర్ కుటుంబ సభ్యుల్ని విచారిస్తూనే మరోవై పు పోలీసులను సైతం సీబీఐ అధికారులు విచారించారు. సోమవారం ఉదయం సుధాకర్ పెద్దకుమారుడు లలిత్​ను సీబీఐ కార్యా లయానికి రప్పించారు. చాలాసేపు లలిత్​ను అధికారులు విచారించారు. సుధాకర్ రెండు నెలల కాలంలో ఎదుర్కొన్న పరిస్థితుల్ని సీబీఐ క్షుణ్ణంగా తెలుసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా గతనెల 16న ఘటన జరగడానికి ముందు పరిణామాలు... సుధాకర్ మానసిక స్థితి ఎలా ఉండేది... ఆయన ఇంటిలో ఎలా ఉండే వారు అనే విషయాలపై సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

లలిత్​ను సీబీఐ అధికారులు విచారిస్తుండగానే.. సుధాకర్ తల్లి కావేరి బాయి కుటుంబ సభ్యులతో కలిసి సీబీఐ కార్యా లయానికి వచ్చారు. సీబీఐ అధికారులకు కావేరి బాయి వినతి పత్రం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు... సుధాకర్ ఘటనకు సంబంధించిన వివిధ అంశాలను సీబీఐ పరిశీలించింది. పోర్టు ఆసుపత్రి వద్ద ఘటన జరిగిన ప్రదేశానికి సీబీఐ అధికారులు వెళ్లారు. ఇప్పటికే వీడియో ఫుటేజీలను పరిశీలించిన సీబీఐ బృందం.. ఆ రోజు జరిగిన పరిణామాల తీరుతెన్నులు ఎలా ఉన్నాయనే విషయంపై వివిధ కోణాల్లో పరిశీలన జరిపింది. అనంతరం 4వ పట్టణ పోలీసు స్టేషన్​కు సీబీఐ చేరుకుంది. ఆ రోజు విధి నిర్వహణలో భాగంగా ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లిన పోలీసుల వివరాలను తెలుసుకుంది. స్టేషన్​లో పోలీసు ఉన్నతాధికారులను సైతం ప్రశ్నించింది.

తొలి రెండు రోజుల కేసు విచారణలో వైద్యుల నుంచి వివిధ రూపాల్లో సమాచారం సేకరించిన సీబీఐ... మూడో రోజు కుటుంబ సభ్యులు, పోలీసుల్ని విచారించింది. కింగ్ జార్జి ఆసుపత్రిలో హౌస్ సర్జన్లను సీబీఐ మరోసారి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి..

'దాడికి పాల్పడిన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి'

Last Updated : Jun 2, 2020, 3:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.