విమ్స్ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ మరణించిన మహిళ మెడలో.. మూడు తులాల బంగారు గొలుసు మాయమైందంటూ ఆమె కుటుంబ సభ్యులు విశాఖలోని ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి క్రైం ఎస్సై శివ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమిలికి చెందిన దినకాల వసుంధర కరోనాతో ఈనె ఆరో తేదీన మృతి చెందారు. భౌతికదేహం అప్పగించినపుడు మెడలో బంగారు గొలుసు కనిపించలేదు. విమ్స్ హెల్ప్‌డెస్క్‌లో ఫిర్యాదు చేసినా స్పందన లేకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: అత్యాచారానికి గురై కరోనా రోగి మృతి!
పోలీసులు ఆసుపత్రికి వచ్చి దర్యాప్తు చేశారు. గురువారం మరోసారి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తామన్నారు. అభియోగం ఎదుర్కొంటున్న వ్యక్తిని విధుల నుంచి తప్పించామని ఆసుపత్రి డైరెక్టర్ రాంబాబు తెలిపారు. ఈ ఘటనపై ముగ్గురు వైద్యులతో విచారణకు ఆదేశించామన్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ నిబంధనలు గాలికొదిలేస్తున్న విశాఖ వాసులు