కరోనా లాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పడు ప్రభుత్వ సాయం ప్రజలకు సరిగా అందుతోందా? లేదా? అని చూసుకోవడం ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల బాధ్యతని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం రాత్రి విశాఖలోని పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. వాలంటీర్లతో పాటు నాయకులు, ప్రజాప్రతినిధులు వెళ్తారని, అందులో తప్పేమీ లేదని పేర్కొన్నారు. బాధ్యతగల పౌరుడిగా, ప్రజాప్రతినిధిగా, పార్టీ కార్యకర్తగా ప్రభుత్వ సాయం పంపిణీని పర్యవేక్షించడం తన బాధ్యతగా తెలిపారు. మొట్టమొదటిసారిగా జొన్నలను రైతుల వద్దకే వెళ్లి కొనుగోలు చేస్తోందన్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఏమీ చెయ్యట్లేదని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపణ తగదన్నారు. సంక్షోభ సమయాల్లో రాజకీయాలు తగవన్నారు.
ఇదీ చదవండి :