విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైళ్లలో బాంబు పెట్టామంటూ... ఓ అజ్ఞాత వ్యక్తి 100కు డయల్ చేసి చెప్పాడు. ఆగంతకుడి ఫోన్ కాల్‌తో రైల్వే రక్షక దళం పోలీసులు.. అప్రమత్తమయ్యారు. ఏం జరుగుతుందో అని వెంటనే విశాఖ రైళ్లను ఆపేసి.. తనిఖీలు నిర్వహించారు. తెలంగాణలోని కాజీపేటలో ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి వద్ద కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లను ఆపి.. పోలీసులు సోదాలు నిర్వహించారు. రైలు బోగీల్లో జాగీలలతో తనిఖీలు చేపట్టారు.
పోలీసుల తనిఖీలు చూసి... రైళ్లలో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఏం అవుతుందోనని.. భయాందోళనకు గురై అయ్యారు. చివరకు పోలీసులు... అది ఫేక్ కాల్‌గా గుర్తించారు.
ఇదీ చదవండి: విశాఖలో డ్రగ్స్ కలకలం..54 గ్రాముల మాదకద్రవ్యాలు స్వాధీనం