ETV Bharat / city

కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికలు వాయిదా వేయండి: భాజపా - bjp leader vishnu kumar raju latest press meet

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని భాజపా నాయకులు కోరారు. వైరస్​ వ్యాప్తి కాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని భాజపా నేత విష్ణుకుమార్​ రాజు విజ్ఞప్తి చేశారు. కరోనా నిర్ధరణ కోసం విశాఖలో ప్రత్యేక ల్యాబ్​ సదుపాయం ఏర్పాటు చేయాలని సూచించారు.

కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికలు వాయిదా వేయండి: భాజపా

author img

By

Published : Mar 14, 2020, 6:32 PM IST

స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలన్న భాజపా నేత విష్ణుకుమార్​ రాజు

రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు వాయిదా వేయాలని భాజపా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. విశాఖలో మాట్లాడిన ఆయన.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎన్నికల కమిషన్ గాని జోక్యం చేసుకుని తగు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రెండు నెలలు ఎన్నికలు వాయిదా వేసినంత మాత్రాన పోయేదేమీ లేదని అన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా.. వైరస్​ నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. కరోనా వైరస్​ నిర్ధరణ కోసం విశాఖలో ప్రత్యేక ల్యాబ్​ సదుపాయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి పేర్నినానికి ​కృతజ్ఞతలు

మంత్రి పేర్ని నానికి కృతజ్ఞతలు తెలిపిన భాజపా నేత విష్ణు కుమార్​ రాజు

విశాఖలో ఈనెల 12వ తేదీ రాత్రి నిమ్మకూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగేశ్వరరావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళ్తున్న మంత్రి పేర్నినాని వెంటనే స్పందించి అతనికి చికిత్స చేయించారు. దీనిపై స్పందించిన భాజపా నేత విష్ణుకుమార్​ రాజు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి హోదాలో ఉన్న ఆయన రోడ్డు ప్రమాదానికి గురైన క్షతగాత్రుణ్ని ఆస్పత్రిలో చేర్పించడం మానవత్వానికి ప్రతీకని అన్నారు.

పోలీసుల తీరు బాధాకరం

పోలీసులు బెదిరిస్తున్నారన్న నంద్యాల భాజపా నేతలు

వైకాపా నాయకుల పాత్రను పోలీసులు పోషిస్తున్న తీరు బాధాకరమని కర్నూలు జిల్లా నంద్యాల భాజపా నాయకులు అభిరుచి మధు అన్నారు. నంద్యాల, గోస్పాడు మండలాల్లో ఎంపీటీసీ స్థానాల్లో ఉన్న తమ అభ్యర్థులను బెదిరించడం అన్యాయమని అన్నారు. ఎవరు బెదిరించినా తమ అభ్యర్థులను కాపాడుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీని నిలిపివేస్తూ ఎస్​ఈసీ నిర్ణయం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.