సింహాచలం సిబ్బందికి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారంటే... దేవాదాయ శాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం అవుతోందని మాజీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. దేశంలోనే సింహాచలం పుణ్యక్షేత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని... అలాంటి దేవస్థానానికి ప్రసాద పథకం కింద రూ.53 కోట్లు కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు.
సింహాచల దేవస్థానం ప్రసాదానికీ ఇబ్బంది పడుతోందని చెప్పుకొచ్చారు. పేద ప్రజలు ఆవాస్ పథకంలో ఇంటికి డబ్బులు కట్టినా... ఈ ప్రభుత్వం ఆ ఇళ్లను పూర్తి చేయలేదని ఆరోపించారు. ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టడం సరైంది కాదని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. పేద ప్రజల ఇంళ్లను నిర్మించి ఇవ్వాలని భాజపా తరపున డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు.
వైకాపా ప్రభుత్వం రాష్టాన్ని అప్పులలో ముంచేసిందని... సీఎం జగన్ ఒక్కసారి కళ్లు తెరిచి ప్రజల ఇబ్బందులు చూడాలని పేర్కొన్నారు. రుషికొండ బీచ్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని విశాఖలో నిర్వహించిన సమావేశంలో వివరించారు.
ఇదీ చదవండి: