ETV Bharat / city

Visakha Steel Plant : విశాఖ ఉక్కు పరిశ్రమకు లాభాల పంట - విశాఖ ఉక్కు పరిశ్రమ వార్తలు

నష్టాలను కారణంగా చూపి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో.. ఆ సంస్థకు లాభాల పంట పండింది. 2021-22 వార్షిక నివేదిక ప్రకారం డిసెంబర్‌ నాటికే రూ.790 కోట్ల నికర లాభం వచ్చింది.దీంతో గత అయిదేళ్లలో రెండేళ్లు లాభాలు సాధించినట్లయింది.

Visakha Steel Plant
Visakha Steel Plant
author img

By

Published : Apr 23, 2022, 4:57 AM IST

కేంద్ర ప్రభుత్వం నష్టాలను కారణంగా చూపి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో.. ఆ సంస్థకు లాభాల పంట పండింది. కేంద్ర ఉక్కు శాఖ విడుదల చేసిన 2021-22 వార్షిక నివేదిక ప్రకారం గత ఏడాది ఏప్రిల్‌- డిసెంబర్‌ మధ్యకాలంలో రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎన్‌పీఎల్‌)కు పన్నుకు ముందు రూ.946 కోట్లు, పన్ను తర్వాత రూ.790 కోట్లకు పైగా నికర లాభం వచ్చింది. గత సంవత్సరం వచ్చిన రూ.1,839 కోట్ల నష్టాలను అధిగమించి ఈసారి లాభాలబాట పట్టింది. దీంతో గత అయిదేళ్లలో రెండేళ్లు లాభాలు సాధించినట్లయింది.

ఉత్పత్తి, అమ్మకాలు, కంట్రిబ్యూషన్‌ మార్జిన్లలో మంచి పనితీరు కనబరిచింది. డిసెంబర్‌ 31 నాటికి 15,928 మంది ఉద్యోగులతో నడుస్తున్న ఈ సంస్థ క్రితం సంవత్సరంతో పోలిస్తే ముడి ఉక్కు ఉత్పత్తిలో 47%, ఫినిష్డ్‌ స్టీల్‌ ఉత్పత్తిలో 75% వృద్ధి సాధించింది. డిసెంబర్‌ నాటికే రూ.19,401 కోట్ల అమ్మకాల టర్నోవర్‌తో క్రితం సంవత్సరం కంటే 69% వృద్ధిని నమోదు చేసింది. 37.33 లక్షల టన్నుల విక్రయాలతో ఈ విభాగంలో 21% వృద్ధిని సాధించింది. 10 లక్షల టన్నుల ఉక్కును ఎగుమతి చేసి రూ.4,572 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది కంటే ఇది 45% అధికం. 2021 మార్చి 31 నాటికి రూ.2,464 కోట్లు ఉన్న సంస్థ నికర ఆస్తుల విలువ డిసెంబర్‌ నాటికల్లా రూ.3,240 కోట్లకు పెరిగింది.

* 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.595 కోట్ల మూలధన వ్యయం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 2022 జనవరి 31 నాటికి రూ.575 కోట్లు ఖర్చు పెట్టింది.
* పూర్తి స్థాయి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఈ కంపెనీ ఆథరైజ్డ్‌ షేర్‌ క్యాపిటల్‌ రూ.8 వేల కోట్లు. సబ్‌స్క్రైబ్డ్‌, పెయిడ్‌ అప్‌ షేర్‌ క్యాపిటల్‌ డిసెంబర్‌ 31 నాటికి రూ.4,889 కోట్లుగా ఉంది.
* ఈ సంస్థకు మార్కెటింగ్‌కు సంబంధించి 5 ప్రాంతీయ కార్యాలయాలు, 23 బ్రాంచ్‌ సేల్‌ ఆఫీసులు ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా మార్కెటింగ్‌కు విస్తృత అవకాశాలు ఏర్పడ్డాయి. రూరల్‌ డీలర్‌షిప్‌ పథకంతో పాటు, గ్రామీణ మార్కెట్‌ను చేజిక్కించుకోవడానికి దేశవ్యాప్తంగా 67 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్‌ రీసెర్చ్‌ కాంటాక్ట్‌ ఆఫీసర్లను నియమించింది. దీనివల్ల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో విశాఖ ఉక్కు వినియోగం పెరిగింది.
* భారతీయ రైల్వే అవసరాలు తీర్చడానికి ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని లాల్‌గంజ్‌లో ఫోర్జ్‌డ్‌ వీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇది టెస్టింగ్‌ స్థాయిలో ఉంది.
* విశాఖ స్టీల్‌ 2021-22లో డిసెంబర్‌ వరకు కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ బీమా కంపెనీలకు రూ.2,170 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.331 కోట్ల ఆదాయాన్ని చేకూర్చింది.

ఇదీ చదవండి: visakha steel: వెనక్కి తగ్గం... విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం స్పష్టీకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.