Paderu Metarnity Hospital: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రసూతి ఆస్పత్రి గర్భిణులు.. బాలింతలతో కిక్కిరిసిపోయింది. మూడు రోజుల్లో 60 వరకు ప్రసవాలు జరగడంతో.. వార్డులన్నీ నిండిపోయాయి. గత్యంతరం లేక అప్పుడే ప్రసవమైన తల్లీబిడ్డలను సైతం నేలపైనే పడుకోబెడుతున్నారు. సరైన వసతులు లేక గర్భిణులు, బాలింతలు.. కుటుంబ సభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ వసతి సౌకర్యం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : Lokesh Counter on Jagan : జగన్ అసూయకు అన్నలాంటి వాడు - లోకేశ్