ETV Bharat / city

సందర్శనాలయంగా... బంగ్లాదేశ్ నౌక 'ఎం.వి.మా'? - ప్రర్యటక షిప్​గా బంగ్లాదేశ్ నౌక

తీవ్ర వాయుగుండం ప్రభావానికి విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ సరకు రవాణ నౌకను సందర్శనాలయంగా మార్చేందుకు ఏపీ పర్యటకాభివృద్ధి సంస్థ చర్యలు చేపడుతోంది. నౌకను తీసుకువెళ్లడానకిి వ్యయం ఎక్కువగా అవుతున్నందున యాజమాన్యం అసక్తి చూపడం లేదు. దీంతో ప్రర్యటక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Bangladesh ship as tourist ship
సందర్శనాలయంగా బంగ్లాదేశ్ నౌక
author img

By

Published : Nov 4, 2020, 6:47 AM IST

Updated : Nov 4, 2020, 1:59 PM IST

విశాఖ తీరంలోని తెన్నేటి పార్క్‌ సమీపానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ సరకు రవాణ నౌక ‘ఎం.వి.మా’ను సందర్శనాలయంగా మార్చేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ కసరత్తు చేస్తోంది. తీవ్ర వాయుగుండం ప్రభావానికి గత నెల 12వ తేదీన తీరానికి కొట్టుకురాగా... ఇప్పటి వరకు వెనక్కి పంపేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా.... నౌకలోని ఇంధనాన్ని సైతం తోడించారు. నౌకను అక్కడి నుంచి సముద్రం లోపలికి తీసుకువెళ్లడానికి మరింత వ్యయం అవనుండడంతో సంబంధిత యజమాని తిరిగి తీసుకువెళ్లేందు ఆసక్తి చూపించడం లేదని తెలిసింది. ఇప్పటికే లక్షల రూపాయలు ఖర్చు చేయగా మరో రూ.5 కోట్ల వరకు అవుతుందని అంచనాకు రావడంతో తరలించడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. 2959 టన్నుల బరువు కలిగిన ఈ నౌకను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది సందర్శనాలయంగా మార్చాలన్నది తాజా ఆలోచన.

నౌక లోపలి భాగాలు, ఇంజిన్, సిబ్బంది పడక గదులు, వంటగదులు, కెప్టెన్‌, ఇతరులకు వినియోగించే గదులను లోపలి నుంచి వీక్షించేలా, వచ్చి వెళ్లేందుకు వీలుగా ప్రవేశ మార్గాలతోపాటు నౌక పైభాగాన్ని ఆతిథ్య సేవలకు ఉపయోగించేలా ప్రణాళిక చేయనున్నారు.

ఇప్పటికే బీచ్‌లో కురుసురా జలంతర్గామి, టీయూ 142 యుద్ధవిమాన ప్రదర్శనశాలలుండగా ఇది అమలు జరిగితే తీరానికి మరింత శోభ తీసుకొచ్చినట్లే అవుతుందని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తీసుకువెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించి పోర్టు, మెరైన్, నేవీ అధికారులతో చర్చించి అమలులోకి తీసుకురావాలని సూచించినట్లు సమాచారం.

ఇదీ చదవండి:

ఇంజనీరింగ్‌ కళాశాలల బోధనా రుసుముల ఖరారు !

Last Updated : Nov 4, 2020, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.