ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఆరేటి ఉమామహేశ్వరరావు అనే పీహెచ్డీ స్కాలర్ దందాలు చేస్తున్నారని.. చర్యలు తీసుకోవాలని వర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కోరారు. ఆర్టీఐ యాక్ట్‌లను సుమారు ఆరు వందల సార్లు ఉపయోగించి ఏయూలోని టీచింగ్, నాన్-టీచింగ్, ఉన్నత అధికారులను సైతం బెదిరిస్తూడని వారు వాపోయారు. అతనిపై చర్యలు తీసుకోవాలని ఏయూ హిందీ విభాగ ఆచార్యుడు నల్ల సత్యనారాయణ, ఆచార్య షారోన్ రాజ్ డిమాండ్ చేశారు.
అంతకు ముందు...
తన పీహెచ్డీ ఫైలుపై నెలరోజులకు పైగా వీసీ సంతకం పెట్టడం లేదంటూ... గత రెండు రోజులుగా ఆరేటి ఏయూ ప్రధాన ద్వారం వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసనకు తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ మద్దతు తెలిపారు.
ఇదీ చదవండి: