విశాఖ ఏజెన్సీ గూడెం కొత్తవీధి మండలం పెదవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి.. నిండు గర్బణి అయిన దేవరాజు ఈశ్వరమ్మను.. చింతపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఫీడర్ అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. పెంటపాడు వద్దకు వచ్చేసరికి అటుగా వస్తున్న చింతపల్లి ఏఎస్పీ వి.విద్యాసాగర్ ఆ గర్భిణిని చూసి చలించిపోయారు.
పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతున్న గర్బిణీని చూసి తన వాహనాన్ని ఆపారు. ప్రసవానికి ఆలస్యమవుతుందని భావించి ఆమెను ఆయనే స్వయంగా ఎత్తుకుని తన వాహనంలో.. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గర్బిణి పట్ల చింతపల్లి ఏఎస్పీ వ్యవహరించిన తీరుపట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: