ETV Bharat / city

FIGHT FOR MONEY : అప్పు తీర్చమన్నందుకు...కర్రలతో, కత్తులతో దాడి...

తీసుకున్న అప్పు తీర్చమన్నందుకు వారి మధ్య పెద్ద రచ్చే జరిగింది. అవసరం ఉంది ఇచ్చిన సొమ్ము తిరిగి ఇవ్వమన్నందుకు కర్రలు, కత్తులతో కొట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన విశాఖ జిల్లా మాకవరపాలెం మండలంలో లచన్నపాలెంలో చోటు చేసుకుంది.

FIGHT FOR MONEY
అప్పు తీర్చమన్నందుకు...కర్రలతో,కత్తులతో దాడి...
author img

By

Published : Oct 19, 2021, 2:18 PM IST

అప్పు తీర్చమన్నందుకు...కర్రలతో,కత్తులతో దాడి...

తీసుకున్న బాకీ తీర్చమని అడిగినందుకు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. అవసరం ఉంది ఇచ్చిన సొమ్ము తిరిగి ఇవ్వమన్నందుకు కర్రలు, కత్తులతో కొట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన విశాఖ జిల్లా మాకవరపాలెం మండలంలో లచన్నపాలెంలో చోటు చేసుకుంది. లచన్నపాలెంకు చెందిన కిల్లపల్లి శ్రీను, గోవింద్​ల నుంచి అదే గ్రామానికి చెందిన పోతల రాజబాబు, వరహాలబాబు కొద్దిరోజుల క్రితం 8 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. గోవింద్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని విశాఖలో ఆసుపత్రిలో ఖర్చుల నిమిత్తం ఎంతో కొంత ఇవ్వాలని సోదరుడు శ్రీను కోరాడు. దీన్ని సహించలేని రాజబాబు, వరహాలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడి అడ్డుకోవడానికి వెళ్లిన ప్రసాద్, శివ , కన్నబాబు అనే వ్యక్తులపై కూడా కత్తులు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో శ్రీను, శివ, ప్రసాద్ లు తీవ్రంగా గాయపడ్డారు.వారిని ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి ఆందోళన ఉంది. కేసు నమోదు చేసుకున్న మాకవరపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : Teachers salaries issue : నాలుగు నెలలుగా వేతనాలేవీ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.