ఉపాధ్యాయ బదిలీలలో వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు పరిచి మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ... విశాఖ జిల్లా అనకాపల్లిలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బ్లాక్ చేసే ఖాళీ పోస్టులను బదిలీల్లో చూపించాలని డిమాండ్ చేశారు. చలో సచివాలయం ముట్టడికి వెళ్లిన ఉపాధ్యాయులను అక్రమ అరెస్టు చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం నుంచి నెహ్రూచౌక్ కూడలి వద్దకు ప్రదర్శనగా బయలుదేరి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన ప్రభుత్వ ఉపాధ్యాయులు.... తమ డిమాండ్లను వినతిపత్రం రూపంలో సమర్పించారు. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో ఉపాధ్యాయులు బదిలీల ప్రక్రియను వ్యతిరేకిస్తూ సుగుణావతమ్మ వైద్యశాల కూడలిలో నిరసన చేశారు. విజయవాడలో అరెస్టైన ఉపాధ్యాయ సంఘాల నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ...చీరాలలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
ఇదీ చదవండి: