ETV Bharat / city

'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ'పై పిటిషన్: కేంద్రానికి హైకోర్టు నోటీసులు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ వేసిన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. ధర్మాసనం... కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

ap high court gave notice to central government on vishaka steel plant privatization

author img

By

Published : Apr 15, 2021, 4:36 PM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై గురువారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను సవాల్‌ చేస్తూ విశ్రాంత ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది. కేంద్ర కేబినెట్‌ తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని పిటిషన్‌లో కోరారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిశ్రమను లాభాల బాట పట్టించవచ్చని, ప్రైవేటీకరణ అన్నది సమస్యకు పరిష్కారం కాదని లక్ష్మీనారాయణ పిటిషన్‌లో పేర్కొన్నారు.

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పడిన వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. కార్మికుల ఉద్యమానికి మద్దతుగా నిలిచిన లక్ష్మీనారాయణ .. విశాఖ ఉక్కును నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కార్మికసంఘాలు, వివిధ పార్టీల నేతలతో లక్ష్మీనారాయణ సమాలోచనలు జరుపుతున్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి:

'ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల'పై విచారణ 19కి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.