Additional Vistadome Coach to Kirandul train: అరకు వెళ్లే పర్యాటకుల సౌకర్యార్థం విశాఖ - కిరండూల్ - విశాఖ రైలుకు..అరకు వరకు ఒక విస్టాడోమ్ బోగీని అదనంగా జత చేయనున్నట్లు వాల్తేర్ డీఆర్ఎం అనూప్‌కుమార్ సత్‌పతి తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ బోగీ అరకు వరకు వెళ్లి అక్కడి నుంచి విశాఖ వస్తుందన్నారు. ఈ రైలుకు ఇప్పటికే రెండు విస్టాడోమ్ బోగీలు ఉండగా, ఇది మూడోదన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అరకుకి వెళ్లే పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండడం, ప్రతి ఒక్కరూ విస్టాడోమ్ కోచ్‌లో ప్రయాణించాలని అనుకోవడంతో.. రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బోగిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి : Ratha Sapthami at Tirumala : తిరుమలలో ఏకాంతంగా రథసప్తమి వేడుకలు -తితిదే
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!