పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ రిలేనిరాహారదీక్షలు చేస్తున్న శిబిరాన్ని.. సినీనటుడు శివాజీ సందర్శించారు. కార్మికులకు సంఘీభావం తెలిపారు. అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ నాయకులు కలిసి పోరాడితే.. కేంద్రం తప్పక తలవంచుతుందని అభిప్రాయపడ్డారు.
ఆంధ్రుల హక్కుగా నిర్మించిన విశాక ఉక్కును ప్రైవేటీకరిస్తుంటే చూస్తూ ఊరుకోమని శివాజీ హెచ్చరించారు. ఈ పరిశ్రమ విశాఖ ప్రజలకే కాక.. రెండు రాష్ట్రాల గుండెచప్పుడని పేర్కొన్నారు. విశాఖ ఒకప్పుడు గ్రామంగా, నగరంగా, ఇప్పుడు మహా నగరంగా మార్పు చెందింది ఉక్కు పరిశ్రమ వల్లేనని గుర్తు చేశారు. కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు, రాజకీయ పార్టీలు, సినీరంగ ప్రముఖులు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: