ETV Bharat / city

Cattle lover in visakhapatnam: వివాహం చేసుకోకుండా మూగజీవాలను సాకుతున్న మహిళ - మూగజీవాలు

Cattle lover in visakhapatnam: ఆ ఇంటి ముందు మూగజీవాలు ఆహారం కోసం బారులు తీరుతాయి. వాటిని అదరించడమే పనిగా పెట్టుకుని.. వాటితోనే మమేకం అవుతున్నారు విశాఖపట్నానికి చెందిన శాంతి. వివాహం కూడా చేసుకోకుండా ఆ జీవులను సాకుతున్నారు. కష్టపడి సంపాదించిన మొత్తాన్ని.. మూగజీవుల ఆహారం కోసం ఖర్చు చేయడం తనకు తృప్తి నిస్తున్నాయంటున్న శాంతిపై కథనం.

వివాహం కూడా చేసుకోకుండా మూగజీవాలను సాకుతున్న మహిళ

author img

By

Published : Nov 28, 2021, 2:20 PM IST

Updated : Dec 6, 2021, 2:04 PM IST

వివాహం చేసుకోకుండా మూగజీవాలను సాకుతున్న మహిళ

Cattle lover in visakhapatnam: విశాఖపట్నం పెద వాల్తేరు ప్రాంతంలో ఓ ఇరుకు వీధిలోకి మూగజీవాలు ఒక నిర్ణీత వేళకు బారులు తీరుతాయి. ఇవన్నీ ఎందుకు ప్రతిరోజూ ఒకే సమయంలోనే ఆ ఇంటి వద్దకు చేరుతాయని పరిశీలించిన వారికి మాత్రం... ఆశ్చర్యం కలిగే అంశం తెలుస్తుంది. అక్కడ నివాసం ఉండే ఓ మహిళ.. వాటికి నిత్యం రెండు పూటలా ఆహారం పెడుతున్నారు. కుట్టుపని చేసి సంపాదించే మొత్తాన్ని తన జీవనం కోసం కొద్దిగా ఉపయోగించి.. మిగిలినదంతా ఈ మూగజీవాలకోసమే వెచ్చిస్తున్నారు.

ఆవులు, పిల్లులు, కుక్కలు.. ఇలా మూగజీవాలన్నింటికి ఆమే స్వయంగా పేర్లు పెట్టి... వాటిని పిలుస్తుంటారు. ఉదయం ఒక సమయంలో పిల్లులు, కుక్కలు వస్తాయి. మరో సమయంలో ఆవులు వచ్చి చేరుతాయి. సాయంత్రం కూడా అదే విధంగా ఈ మూగ జీవాలు ఇక్కడికి వస్తాయి. ఈ ప్రాంత వాసులకు ఈ దృశ్యాలన్నీ నిత్యం దర్శనమిస్తుంటాయి. నిత్యం వాటికి సమయానికి అహారం అందించడం కోసం.. శ్రమించడంలో ఆనందం పొందుతున్నట్లు ఆమె చెబుతున్నారు.

ఇదీ చదవండి:

PADDY FARMERS PROBLEMS IN EAST GODAVARI : జగన్ సారూ... ఘొల్లున ఏడుస్తున్నాం.. ఆదుకోండి

Last Updated : Dec 6, 2021, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.