రాష్ట్ర సహకార చక్కెర కర్మాగారాలకు 100 కోట్ల రుణం మంజూరు సహకార చక్కెర కర్మాగారాలకు ఆర్థిక ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తుతో జాతీయ సహకార అభివృద్ధి సహకార సంస్థ (ఎన్సీడీసీ) 100 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసింది. ఆ నగదును ఆయా చక్కెర కర్మాగారాల ఖాతాల్లో జమచేసింది.విశాఖ జిల్లా గోవాడకు 44 కోట్లు, ఏటికొప్పాకకు 23 కోట్లు, తాండవ చక్కెర కర్మాగారాలకు 21 కోట్లు జమయ్యాయి. విజయనగరం జిల్లా భీమ్ సింగ్ షుగర్స్‌కు 12 కోట్లు జమ చేశారు. ఇప్పటివరకూ రైతులకు ఎలాంటి నగదు చెల్లింపులు చేయని చక్కెర కర్మాగారాలు.. రుణ మంజూరుతో బకాయిలచెల్లింపుల ప్రక్రియ ప్రారంభించాయి.
ఇవీ చూడండి.
అధికారంలోకి వస్తే చంద్రన్న బీమా 10 లక్షలకు పెంచుతాం: లోకేశ్