లోక్సభలో 377 నిబంధన కింద మచిలీపట్నం ఎంపీ పలు విషయాలను ప్రస్తావించారు. ముద్ర పథకం కింద రైతులు, చిన్న వ్యాపారులకు రుణాలివ్వాలని కోరారు. రూ.1.60 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రైతుల ఆదాయం పెంచేందుకు ఏపీ రూపొందిస్తున్న ప్రణాళికకు మద్దతు ఇవ్వాలన్నారు.
వ్యవసాయేతర రంగాల్లోనూ రైతులను ప్రోత్సహించాలని ఏపీ భావిస్తోందని ఎంపీ బాలశౌరి తెలిపారు. అందుకోసం చిన్న వ్యాపారులు, జాలర్లకు సైతం ముద్రపథకాన్ని అమలు చేయాలన్నారు. అలాగే జిల్లాల్లో పంటరుణాల జారీకి బ్యాంకులకు నెలవారీ లక్ష్యాలను నిర్దేశించాలన్నారు.
ఇదీ చదవండి