తెదేపా నేతలను ఆ పార్టీ అధినేత చంద్రబాబే రెచ్చగొట్టి ముఖ్యమంత్రి జగన్‌ను దూషించేలా ప్రోత్సహిస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలు ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన పెడన శాసనసభ్యుడు జోగి రమేశ్‌పై తెదేపా నేతలు కర్రలు, రాళ్లతో దాడి చేశారని ఆరోపించారు. కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ నేతల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమిని ముందే ఊహించి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బుద్దా వెంకన్న నాటకాలు అందరికీ తెలుసని విమర్శించారు. చంద్రబాబు తక్షణమే ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలన్నారు. వివాదాలతో నాయకుడు కావాలని లోకేశ్ ప్రయత్నిస్తున్నారని.. భవిష్యత్తులో ఇలాగే వ్యవహరిస్తే తెదేపాకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
ఇదీ చదవండి: Condemn: ఆంధ్రాలో ఉన్నామా? అఫ్గాన్‌లో ఉన్నామా?: తెదేపా