సింహాచలం దేవస్థానం భూములపై వైకాపా కుట్ర పన్ని ఆస్తుల కబ్జాకు విజయసాయిరెడ్డి నేతృత్వంలో ప్రణాళిక రచిస్తోందని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఆరోపించారు. పరిపాలనా రాజధాని పేరుతో విశాఖ చుట్టూ.. దాదాపు 39 వేల ఎకరాలను జగన్, ఆయన అనుచరులు కబ్జా చేశారని విమర్శించారు. ఇప్పుడు ఏకంగా ట్రస్టు భూములు, ఆలయ భూముల్ని కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు యత్నిస్తున్నారని ఆక్షేపించారు. సింహాచలం ఆలయ భూముల్లో ఎలాంటి అక్రమాలు జరిగినా.. సహించేది లేదని హెచ్చరించారు. మన్సాస్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉన్న 10 లక్షల కోట్ల విలువైన 14,800 ఎకరాల భూముల్ని కబ్జా చేసేందుకు విజయసాయి రెడ్డి విశాఖలో తిష్ట వేసి మరీ ప్లాన్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ట్రస్టు భూములు, అప్పన్న స్వామి భూముల జోలికి వస్తే ఊరుకోబోమని స్పష్టం అన్నారు.
ఇదీ చదవండి: