ఆర్టీసీ ఛార్జీల పెంపుతో పేదలపై అదనంగా వేయి కోట్ల రూపాయల భారం పడుతుందని... తెదేపా నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఆర్టీసీని ప్రభుత్వంలో వీలినం చేసి... ఆర్టీసీ బకాయిలు, అప్పులు, నష్టాలు భరిస్తుందని.. ఏవేవో మాటలు చెప్పారని యనమల ఎద్దేవా చేశారు. ఇప్పుడేమో.. ఛార్జీలు పెంచి వేయి కోట్లు భారం పేదలపై వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆ భారాన్ని ప్రజలపై పడకుండా చూడాలని యనమల డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కన్నప్రేమ కావాలి... పెంచిన ఆప్యాయత ఉండాలి..!