ప్రజా ప్రతినిధుల గౌరవాన్ని నిలబెట్టాల్సిన పదవిలో ఉన్న వ్యక్తే... గౌరవాన్ని కించపరచడం సరికాదని యనమల రామకృష్ణుడు స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. స్పీకర్‌కు విచక్షణాధికారాలు ఉన్నందువల్లే.. వివాదాస్పదం కారాదని హితవు పలికారు. వివాదాస్పద వ్యాఖ్యలే చేస్తే... గౌరవం పొందలేరని తెలిపారు. నిరాధార ఆరోపణలు చేయడం స్పీకర్ స్థానంలో ఉన్నవారికి తగదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోపణల గురించి సమాచారం ఏదైనా ఉంటే తెదేపాకైనా ఇవ్వాలని.. లేదంటే మీడియాకు విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బిజినెస్ రూల్స్ 168, 169 మీకెందుకు వర్తించకూడదని యనమల సూటిగా ప్రశ్నించారు.
ఇదీ చదవండి: 'సీబీఐ చిటికె వేస్తే వైకాపా పరిస్థితేంటి..?'