ETV Bharat / city

'ప్రధాని వ్యాఖ్యలు సీఎం జగన్ విషయంలో అక్షర సత్యాలు' - సీఎం జగన్​పై యనమల రామకృష్ణుడు విమర్శలు

అవినీతి కేసుల విచారణలో జాప్యం భవిష్యత్ కుంభకోణాలకు పునాది రాయిగా ఎలా మారుతుందనేందుకు.. ప్రస్తుత జగన్ పాలనే ఉదాహరణ అని తెదేపా నేత యనమల ధ్వజమెత్తారు. ఈ విషయంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు జగన్ కేసులో అక్షర సత్యాలని ఉద్ఘాటించారు.

yanamala ramakrishnudu
యనమల రామకృష్ణుడు
author img

By

Published : Oct 28, 2020, 6:42 PM IST

ప్రధాని మోదీ వ్యాఖ్యలు సీఎం జగన్ కేసులో అక్షర సత్యమని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. 'అవినీతి కేసుల విచారణలో జాప్యం భవిష్యత్ కుంభకోణాలకు పునాది అవుతుంది' అన్న ప్రధాని మాటలు జగన్​కు సరిపోతాయని అన్నారు.

అవినీతి కేసుల దర్యాప్తులో జరిగే ఆలస్యం ఒక శృంఖలంలాగా భవిష్యత్ కుంభకోణాలకు పునాది రాయిగా ఎలా మారుతుందన్నదానికి ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి పాలనే ఉదాహరణ అని యనమల దుయ్యబట్టారు. సీబీఐ, ఈడీ వంటి విచారణ సంస్థలు వేగవంతంగా పనిచేసేలా చేసి ఆర్థిక నిందితులపై చర్యలు తీసుకునేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందని గుర్తుచేశారు.

ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన ఆర్థిక నేరగాళ్ళను శిక్షించకపోతే మొత్తం సమాజం నష్టపోతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్పష్టం చేశారని యనమల గుర్తు చేశారు. కార్యాచరణను మళ్లీ జాప్యం చేయడానికి 16 కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న జగన్ న్యాయ వ్యవస్థపై దాడి ప్రారంభించారని విమర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాని వ్యాఖ్యలు కీలకం కానున్నాయని యనమల అభిప్రాయపడ్డారు.

జగన్ సీఎం అయిన తరువాత లాండ్, శాండ్, వైన్, మైన్​లలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. వేల కోట్ల అవినీతి చేసి నామమాత్రంగా పథకాలను అమలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇవీ చదవండి:

పెర్​ఫ్యూమ్​ గన్... పేలిస్తే కోతులు రన్​...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.