సమాజంలో సహృదయ భావం... చరిత్రపై అవగాహనతోనే సాధ్యం - ఏపీ ప్రాథమిక విద్యా కమిషనర్ చిన వీరభద్రుడు వార్తలు
రచయితలు చరిత్రపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరముందని... ఏపీ ప్రాథమిక విద్యా కమిషనర్ చిన వీరభద్రుడు అభిప్రాయపడ్డారు. విజయవాడలో చారిత్రక నవలా రచనపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చారిత్రక రచనపై పరిశోధన అవసరమన్నారు. చరిత్ర తెలుసుకుంటే సమాజంలో అందరి మధ్య సహృదయ భావం పెరుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగు నవలా రచయితలు చరిత్రను పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. దీనివల్ల చరిత్ర వక్రీకరణకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
చిన వీరభద్రుడు
sample description