సాధారణంగా ట్రాఫిక్ సిగ్నల్ లైట్లలో ఉపయోగించే చిహ్నాల్లో పురుషుల బొమ్మలే కనిపిస్తాయి. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎమ్‌సీ) నగరంలోని దాదర్ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లలో పురుషుల స్థానంలో మహిళల బొమ్మల్ని వినియోగంలోకి తెచ్చింది. ఆ ప్రాంతంలో 120 కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లతోపాటు పాదచారుల సూచీ బోర్డులమీద కూడా ఈ మార్పులు చేసింది. దేశంలో మహిళల చిహ్నాల్ని ట్రాఫిక్ లైట్లలో ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఎరుపు, ఆకుపచ్చ రంగుల లైట్లలో ఈ చిహ్నాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ రాష్ట్ర పర్యటక మంత్రి ఆదిత్య ఠాక్రే వీటి గురించి ట్వీట్ చేశారు. ఈ ప్రయత్నాన్ని ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం కూడా మెచ్చుకోవడం విశేషం. ‘మార్పు చిన్నదే కానీ సరైనది’ అని ఈ మార్పును ఆహ్వానించారంతా.
మార్పు చిన్నదే కానీ.. యూఎన్వో మెచ్చుకుంది
సాధారణంగా ట్రాఫిక్ సిగ్నల్ లైట్లలో ఉపయోగించే చిహ్నాల్లో పురుషుల బొమ్మలే కనిపిస్తాయి. కానీ ఆ మున్సిపల్ కార్పొరేషన్ వినూత్న ఆలోచన చేసింది. ట్రాఫిక్ సిగ్నల్ లైట్లలో పురుషుల స్థానంలో మహిళల బొమ్మల్ని వినియోగంలోకి తెచ్చింది. ఇలా చేయం దేశంలో ఇదే మొదటిసారి.