ETV Bharat / city

"నా బండికే డ్యాష్​ ఇస్తావా..? నీ అంతు చూస్తా".. బస్సు డ్రైవర్​పై మహిళ దాడి - ఆంధ్రప్రదేశ్ నేర వార్తలు

WOMAN ATTACK: ఆర్టీసీ డ్రైవర్లపై దాడులు పెరుగుతున్నాయి. బండి పక్కకు తీయమన్నందుకు కొందరు.. నన్నే దాటేస్తావా అని మరికొందరు అసభ్యపదజాలంతో దూషించడం లాంటివి ఎక్కువవుతున్నాయి. గత నెలలో విజయవాడ​లో ఓ ఇద్దరు యువకులు బస్సు డ్రైవర్​పై దాడి మరువకముందే.. మరో మహిళ హల్​చల్​ చేసింది.

WOMAN ATTACK
WOMAN ATTACK
author img

By

Published : Jul 31, 2022, 1:14 PM IST

WOMAN ATTACK: వాహనం చేతిలో ఉంటే చాలు.. మాకు ఎవరితో పని లేదు అనుకుంటున్నారు నేటి యువత. వాళ్లకు ఎవరైనా అడ్డం వచ్చిన లేక వారి బండిని ఓవర్​ టేక్​ చేసిన వాళ్ల అంతుచూసేదాకా ఆగడంలేదు. మనుషులమనే విచక్షణ కోల్పోయి.. దాడి చేస్తున్నారు. మొన్న హైదరాబాద్​లో ఆటోను పక్కకు తీయమన్నందుకు ఆ డ్రైవర్​ విచక్షణ కోల్పోయి.. బస్సు డ్రైవర్​పై దాడి చేశాడు. ఈ ఘటన మరువకముందే విజయవాడలో ఇలాంటి తరహా ఘటనే చోటుచేసుకుంది. నా బండినే గుద్దుతావా అని ఓ మహిళ బస్సు డ్రైవర్​పై దాడి చేసింది.

అసలేం జరిగిందంటే: విజయవాడలోని కంట్రోల్‌ రూమ్‌ సమీపంలో ఆర్టీసీ బస్సు.. తన బైకును ఢీకొట్టిందంటూ ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కోపంలో ఊగిపోతూ బస్సును ఆపింది. అనంతరం బస్సు డ్రైవర్‌ను చితకబాదింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

"నా బండినే గుద్దుతావా.. నీ అంతు చూస్తా".. బస్సు డ్రైవర్​పై మహిళ దాడి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.