తెలుగు ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వ్యవహారిక భాష ఉద్యమానికి శ్రీకారం చుట్టిన గిడుగు రామ్మూర్తి స్మృతికి నివాళులు అర్పించారు. మన భాషను కాపాడుకుని, ఉన్నతంగా తీర్చిదిద్దడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అని ఉపరాష్ట్రపతి అన్నారు. మన మూలాలను తెలియజెప్పి ముందుకు నడిపే సారధి భాషేనన్న ఆయన.. తెలుగు సంస్కృతిని పెంపొందించుకోవడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని కోరారు.
మరోవైపు.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. రాబోయే రోజుల్లో భారత్ ప్రధాన క్రీడాశక్తిగా అవతరించాలని ఆకాంక్షించారు. యువత క్రీడల వైపు మొగ్గు చూపాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.
ఇదీచదవండి.