ETV Bharat / city

Neem Trees: వేప చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయి..? - వేప చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయ్​

తెలుగు రాష్ట్రాల్లో వేప వృక్షాలు ఎండిపోతున్నాయి. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో వేప చెట్లతో రైతులే కాదు.. అన్నివర్గాల వారికి అవినాభావ సంబంధం ఉంటుంది. అంతా ఎంతో ప్రేమగా చూసుకునే ఆ చెట్లు కళ్ల ఎదుటే మాడి.. కళావిహీనం అవుతుండడం కలవరానికి గురి చేస్తోంది. ఇలా ఎందుకు జరుగుతుందో కూడా అంతుబట్టడం లేదు. మూడేళ్ల క్రితం ఒకసారి ఈ తరహా ఉదంతాలు తెలంగాణలో కనిపించాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లిలో వేప చెట్లు ఎండిపోవడం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ జంట నగరాల్లో పలు ప్రాంతాల్లోనూ ఆ ఆనవాళ్లు కనిపించాయి. కొద్దిరోజులకు... ఏదొకలా ఆ పీడ వదిలిందనకుంటే.. ఇటీవల మళ్లీ హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, అనంతపురం, కర్నూలు తదితర జిల్లాల్లో చాలా చోట్ల ఈ ఉద్ధృతి పెరుగుతూ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

వేప చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయి..?
వేప చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయి..?
author img

By

Published : Nov 6, 2021, 6:43 AM IST

వేప చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయి..?

తెలుగునాట ఇప్పుడిదో అంతుబట్టని ప్రశ్నగా మారింది. మనందరి చిరకాల నేస్తం వేపచెట్టుకి ఎందుకీ కష్టం వచ్చింది? ప్రకృతి, పచ్చదనం, పర్యావరణహితంలో అత్యంత మేలు చేసే వేప చెట్లు కీలకపాత్ర పోషిస్తాయి. ఎన్నో రకాలైన పోషకాలు కలిగి శతాబ్దాలుగా ‌ప్రజల అనేక అవసరాలకు పెద్దదిక్కుగా నిలుస్తున్నాయి. తన పరిధి ఉన్నంత మేర ఆహ్లాదకర వాతావరణం పంచే ఈ వృక్షం ఉన్నట్టుండి.. ఎందుకు ప్రమాదంలో పడింది. ఎండుతున్న కొమ్మలు దేనికి సంకేతం? అరిష్టమా? పర్యావరణ వైపరిత్యమా? లక్షలాది వేపచెట్లు ఎండుకొమ్మలతో దర్శనమిస్తుండడంతో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వెంటాడుతున్నాయి. సామాన్యులకు వాటికి సమాధానం మాత్రం దొరకడం లేదు.

వేపచెట్లు ఎండిపోతున్నాయ్​..

ఏ గ్రామంలో ఎక్కడ చూసినా అకస్మాత్తుగా చెట్ల లేత చిగుర్ల నుంచి కొమ్మల వరకు ఎండి పోతున్నాయి. మరీ ముఖ్యంగా... గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంతో వేపచెట్లకు ఉన్న బంధం ఏ మాత్రం విడదీయరాని కావడంతో రైతులు, సాధారణ ప్రజలు అయోమయంలో పడ్డారు. చిన్న దశలో ఉన్న చెట్లైతే పూర్తిగా ఎండిపోతుండటం సర్వత్రా కలవరపరుస్తున్న అంశం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మాములు చెట్లైతే.. గాలిపాటుకు ఏదో అయిందని అనుకోవచ్చు. కానీ వేప విషయంలో అలా అనుకోవడానికి లేదు. చీడపీడలకు విరుగుడుగా ఉపయోగపడే చెట్లు ఇలా ఎందుకు తెగుళ్ల బారిన పడుతున్నాయి? శీతాకాలానికి పచ్చగా కళకళలాడాల్సిన వేపచెట్ల లేతకొమ్మలు ఎందుకు ఎండు ముఖం పడుతున్నాయి?

"డై బ్యాక్" లక్షణాలేనా..

శాస్త్రవేత్తలు, పరిశోధకులు మాత్రం ఈ సమస్య ఇప్పుడే వచ్చింది కాదంటున్నారు. 3, 4 ఏళ్లుగా ఈ తెగులు ఉందని... ఇవి "డై బ్యాక్" లక్షణాలని అంటున్నారు. దీని ప్రభావం కొన్ని వారాల పాటు కొనసాగుతుంది. దీని బారిన పడిన వేపచెట్టు 3 నెలల్లో నిర్జీవంగా మారుతుంది. కీటకాలు, తేయాకు దోమ ద్వారా ఈ తెగులు రావడానికి ఆస్కారం ఉన్నట్లు వెల్లడైంది. కాకపోతే.. వేపచెట్లలో ఉండే ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. వేపతో చేసే సబ్బులు, పేస్టులు, క్రీములకు ఉండే గిరాకీకి కారణం అదే. ఆకులు, పువ్వులు, కాయలు అన్నీ ఔషధాలే. ఆయుర్వేదంలోనూ ఇవి కీలక భాగం. సైంటిఫిక్‌గా చెప్పాలంటే... వేప యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-పారాసిటిక్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-ఫంగల్‌. చాలా మందులు, సౌందర్య ఉత్పత్తుల్లో చోటు కల్పించారు.

తేయాకు తెగులు దాడి..

డై బ్యాక్ తెగులు విషయానికి వస్తే... సాధారణంగా నైరుతి రుతు పవనాలు ఆగమనం సమయంలో జూన్, జులై నెలల్లో అప్పటి వరకు ఉండే పొడి వాతావరణంతో తేయాకు తెగులు దాడి ప్రారంభం అవుతుంది. వ్యాధి కారకాలు.. చిగుర్లు, కొమ్మల తొడుగుల్లో నుంచి వెళ్లిపోయి రసం పీల్చడం వల్ల పచ్చనికొమ్మలు ఎండిపోవడం ఆరంభమవుతుంది. తర్వాత వర్షాకాలంలో జులై చివర, ఆగస్టులో వర్షాలు అధికమైన నేపథ్యంలో సెప్టెంబరు వరకు ఈ పురుగు చేసిన రంధ్రాల ద్వారా గాలిలో, నీటిలో, నేలపై, నేలలోపల, సజీవ, నిర్జీవ దేహాల్లో ఉండే విషపూరిత శిలీంధ్రాలు వృక్షంలోకి ప్రవేశించడం వల్ల హాని తలపెడుతుందని... ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్ చెబుతున్నారు.

90%కి పైగా వేపచెట్లు..

ఈ విషయంలో నిపుణులు అందరి నుంచి ఒకటే అభిప్రాయం వ్యక్తం కావడం లేదు. ఈ తెగులును డైబ్యాక్ డిసీస్ ఆఫ్ నీమ్ అంటారని, ఇది వేపకు మాత్రమే సోకే తెగులనే చెబుతున్నా.. మస్కిటో టీ బగ్ కారణంగా వేప చెట్లు ఎండిపోతున్నాయనే వాదనల్ని కొందరు అంగీకరించడం లేదు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల బీఆర్​ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సహాయ ఆచార్యులు సదాశివయ్య ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మస్కిటో టీ బగ్ వేపపై దాడి చేసినట్లుగా ఎక్కడా రికార్డుల్లో లేదని, వేపకు సోకే అవకాశమే లేదని అంటున్నారాయన. ఫామోస్పిస్ అజాడిరక్టె అనే శిలీంద్రం కారణంగా డై బ్యాక్ డిసీస్ ఆఫ్ నీమ్ వస్తుందని 1997లో ఉత్తరాఖండ్ లో కనిపెట్టారని చెబుతున్నారు. వానాకాలంలో మొదలయ్యే ఈ తెగులు గాలి, వాన, కీటకాలు ఇతర వాహకాల ద్వారా ఇతర వేపలకూ సోకి విస్తరించిందన్నారు. 90%కి పైగా వేపచెట్లు ఈ వ్యాధిబారిన పడ్డట్లుగా జడ్చర్ల మండలంలో చేపట్టిన సర్వే వెల్లడైనట్లు తెలిపారు.

మరొక వాదన కూడా..

ఇక్కడ మరొక వాదన కూడా ఉంది. వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో కొత్తపంటలు.. ప్రత్యేకించి పండ్ల తోటలు, ఆకుకూరలు విస్తృతంగా సాగులోకి వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు దృష్ట్యా.. విదేశీ పంటల సాగు పరిచయాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వేదిక అవుతున్నాయి. ఉదాహరణకు అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, థ్యాయిలాండ్, వియత్నాం, ఇరాన్‌, గ్రీస్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, న్యూజిలాండ్‌, చిలీ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న డ్రాగన్‌ఫ్రూట్, యాపిల్ బేర్, కివి, పీచ్, థాయ్ జామ, బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీ, ఆరెంజ్, ద్రాక్ష తదితర పండ్ల రకాలు మొక్కలు, విత్తనాలు, ఆకుకూరల సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్ ఉమ్మడి జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, కర్నూలు, కడప వంటి రాయసీమ జిల్లాల్లో అవి సాగు చేస్తూ ఫలితాలు సాధిస్తున్నారు.

ఇదే కారణమా..?

అదే సమయంలో తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన హరితహారం, ఆంధ్రప్రదేశ్‌లో వనం-మనం కార్యక్రమం కింద నాటిన మొక్కలన్నీ ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి నాటినవే. ఆరంభంలో అవన్నీ కర్ణాటక, గోవా, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి తెచ్చినవే కావడంతో.. ఆయా ప్రాంతాల నుంచి వ్యాధి కారకాలు వచ్చినట్లు తెలుస్తోంది. విదేశీ డ్రాగన్‌ఫ్రూట్, అవకాడో, థాయిలాండ్ చెర్రీ మొక్కలపై చీడ పురుగులు ఉంటాయి. అది అక్కడే గమనించి నిరోధిస్తే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అలా చేయక పోవడం వల్ల ఇప్పుడు.. కొత్త పంటల సాగు పుణ్యమానికి అతిథి వృక్షం అమ్మలాంటి వేపపై ఈ కొత్త తెగులు విజృంభిస్తోందని అంటున్నారు. ఇలా వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న తరుణంలో.. మరిన్ని ప్రాంతాలకు అధ్యయన బృందాలు పంపించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధం అవుతున్నారు.

ఏదో అరిష్టం జరగబోతుందంటూ..

ఈ వివరాలు తెలియని గ్రామీణ ప్రాంతాల్లో... వేప చెట్లు ఎండిపోవడం చూసి..ఏదో అరిష్టం జరగబోతుందంటూ భయాందోళనకు గురవుతున్నారు. కానీ ఈ పరిణామాలపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదంటున్నారు... పరిశోధకులు. ఏ అరిష్టం జరగదు. కొన్ని చెట్లు చనిపోయినా.. మిగిలినవన్నీ మళ్లీ వసంతకాలంలో కొత్తగా చిగురిస్తాయని చెబుతున్నారు. వేప వృక్షాల లేత కొమ్మలు ఎండిపోవడానికి కారణం... ముఖ్యంగా జామ, చింత, ద్రాక్ష, అవకాడో, జీడిమామిడి, మునగ, కానుగ మొక్కల్లో కనిపించే కీటకం వ్యాధి అని అంటున్నారు. పండ్ల మొక్కలకు బదులు హోస్ట్ ప్లాంట్‌ మొక్కను గుడ్లు పెట్టడానికి... తర్వాత అవి అభివృద్ధి చెందడానికి వేరు మొక్కలను కీటకాలు ఉపయోగించుకుంటున్నాయని చెబుతున్నారు.

చనిపోతే మాత్రం కాస్త ఆందోళన పడాల్సిందే..

సాధారణంగా శీతాకాలం ముగిసిన తర్వాత మళ్లీ వేప వృక్షాల కొమ్మలు కొత్తగా వాటంతట అవే చిగురిస్తా. తెగులు అధికంగా ఉన్న వృక్షాలు చనిపోతే మాత్రం కాస్త ఆందోళన పడాల్సిందే. వాతావరణ మార్పుల నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు, అధిక ఉష్ణోగ్రతల ప్రభావమూ సమస్య కు ఓ కారణంగా భావిస్తున్నారు. తేయాకు తెలుగు నివారణకు ఇప్పటికే చాలా చోట్ల వేప వృక్షం కొమ్మలపై క్రిమిసంహార మందులు అధిక మోతాదుల్లో పిచికారీ చేస్తున్నారు. అది కూడా సరికాదని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఒకవేళ చిన్నచెట్లు ఉండి తప్పనిసరైతే మార్కెట్‌లో లభ్యమయ్యే సాధారణ మందులతో నివారించుకోవచ్చు. భారీ మొత్తం లేదా తీవ్రత గల క్రిమిసంహారకాలు వాడితే పక్కన ఉండే ప్రకృతి, చెట్లు, వ్యవసాయ పంటలు, పండ్లు, కూరగాయలు తోటలపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా చెరువులు, బావులు, భూగర్భ జలాలు కలుషితమై పశు, పక్ష్యాదులు చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

బహుళ పోషకాల ఘని... వేప. మనుషులకు వచ్చే వివిధ వ్యాధులతోపాటు, పంటలకు సోకే చీడల నిర్మూలనకు వేప ఉత్పత్తులు వాడుతారు. అలాంటి వేపనే ఇప్పుడు చీడ తినేస్తున్న దృష్ట్యా.. అంత ఎత్తులో క్రిమిసంహారకాల పిచికారీ కష్టం. ఒకవేళ చేసినా పక్కన ఉండే వృక్షాలు, మొక్కలు, పశుసంపద, నీటి వనరులకు హాని కలిగించే ప్రమాదం ఉన్నందున డ్రోన్ టెక్నాలజీ సాయంతో సురక్షితంగా పిచికారీ చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ లోగా రాష్ట్ర ప్రభుత్వాలు, అటవీ శాఖ శ్రద్ధ పెట్టి వేప వృక్షాల సంరక్షణకు సంబంధిత నిపుణులతో అధ్యయన కమిటీ చేయాలి. ఆ నివేదిక ఆధారంగా జనవరి, ఫిబ్రవరి వరకు ఏ ప్రాంతంలో ఎన్ని వృక్షాలు దెబ్బ తిన్నాయి... కొత్త చిగురు ఎన్నింటికి వచ్చిందో అనేవి గమనించి తదుపరి కార్యచరణ చేపట్టాలి. ఏది ఏమైనా ఏడాదిలోగా ఈ తెగులుకు ముగింపు పలకాల్సిందే అంటున్నారు నిపుణులు.

ఇదీచూడండి:

విద్యుత్ కొనుగోలు స్కీమ్ కాదు.. అదానీ కోసం చేసే స్కామ్: పయ్యావుల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.