ETV Bharat / city

Webinar on Women Security: 'వారిని గుర్తిస్తున్నాం.. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాం'

author img

By

Published : Aug 18, 2021, 10:43 AM IST

మహిళల అక్రమ రవాణా, లైంగిక అణచివేత- భధ్రత అంశాలపై విజయవాడలోని మేరీ స్టెల్లా కళశాలలో వెబినార్ జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హాజరయ్యారు. మహిళల అక్రమ రవాణాను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు.

webinar on women problems in vijayawada
webinar on women problems in vijayawada

మహిళల అణచివేతలో వస్తోన్న కొత్త పోకడలపై విచారణ సంస్థలు దృష్టి పెట్టాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ సూచించారు. మహిళల అక్రమ రవాణా, లైంగిక అణచివేత - భద్రత అంశాలపై విజయవాడ మేరీ స్టెల్లా కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల వెబ్‌నార్‌ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్యఅతిధిగా హజరయ్యారు.

అమెరికా, ఆఫ్రికా, ఫిలిప్పైన్స్, నేపాల్, పాకిస్థాన్, వియాత్నం, ఇటలీతోపాటు మన దేశంలోని 13 రాష్ట్రాల ప్రతినిధులు ఈ వెబినార్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా నిరోధించటానికి తాము ప్రతి జిల్లాలో ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేసి వాటి బాధ్యతలను పోలీస్ అధికారులకు అప్పగించినట్లు వాసిరెడ్డి పద్మ వివరించారు.

రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ వంటి సంస్థలతో కలిపి విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ క్లబ్ లను ఏర్పాటు చేస్తూ- అవగాహనా సదస్సులు నిర్వహిస్తుందన్నారు. ఆన్లైన్ ద్వారా అమాయక యువతులపై వల విసురుతున్న కేటుగాళ్ల గురించి పాఠశాలల్లో బాలికలకు, విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటోందన్నారు.

ఇదీ చదవండి:

Durga Temple Fraud: దుర్గ గుడి ఆదాయానికి టోకరా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.