Village Secretariat Employees: ఉద్యోగంలో చేరి 2021 అక్టోబరు రెండో తేదీకే రెండేళ్లయినా తమకు ఇచ్చిన మాట ప్రకారం ప్రొబేషన్, కన్ఫర్మేషన్ ప్రక్రియ పూర్తి చేయకపోగా.. ఈ ఏడాది జూన్ 30లోగా చేస్తామని సీఎం జగన్ ప్రకటించటంపై గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రొబేషన్ డిక్లరేషన్ సాధనే లక్ష్యంగా గ్రామసచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాచరణ ప్రకటించారు. రేపు నల్ల రిబ్బన్లతో విధులకు హాజరై.. కలెక్టర్, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పే స్కేల్ కూడా కల్పించాలని ఉద్యోగులంతా ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. రేపు ప్రభుత్వంతో గ్రామసచివాలయ ఉద్యోగ నేతలు చర్చలు జరపనున్నారని, చర్చల తర్వాత భవిష్యత్ కార్యాచరణపై తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి
Protest: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళన