విజయవాడ రైల్వే డివిజన్ గూడ్స్ రవాణాలో మరో ఘనతను సాధించింది. ఒక్క రోజే 242 రైళ్లను ఇతర డివిజన్లకు అప్పగించి రికార్డులకు ఎక్కింది. సరకు రవాణాపై గూడ్స్ రైళ్ల ద్వారా ఏటా రికార్డు స్థాయిలో కోట్లాది రూపాయల ఆదాయం ఈ డివిజన్‌కు లభిస్తోంది. ఇందులో ఆపరేటింగ్ విభాగం కీలక పాత్ర పోషిస్తోంది. సాధారణంగా రోజూ డీఆర్‌ఎం కార్యాలయంలో రైల్వే కంట్రోలర్లు, ఆపరేటింగ్ సిబ్బంది 160 గూడ్స్ రైళ్లను నిర్ణీత వ్యవధిలో అప్పగిస్తుంటారు.
ఇందుకు భిన్నంగా ఆదివారం డివిజన్‌కు వచ్చే 122 రైళ్లతో పాటు ఇక్కడి నుంచి వెళ్లే మరో 120 రైళ్లను విజయవంతంగా అప్పగించారు. రైళ్ల వేగం పెరగడం, ట్రాక్ పటిష్ఠత, అధికారులు, సిబ్బంది అప్రమత్తతో ఇది సాధ్యపడింది. ఈ ఘనత సాధించిన విజయవాడ సీనియర్ డివిజనల్ ఆపరేటింగ్ అధికారి (సీనియర్ డీవోఎం) వి.ఆంజనేయులుతో పాటు కంట్రోలర్లు, సిబ్బందిని డీఆర్‌ఎం శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు.
ఇదీ చదవండి: