ETV Bharat / city

ARREST: వృద్ధులే వారి టార్గెట్.. ఎట్టకేలకు చిక్కిన ఇద్దరు నిందితులు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు - హత్య కేసు నిందితులను పట్టుకున్న పోలీసులు

వృద్ధులను టార్గెట్ చేసుకుని గత కొంత కాలంగా విజయవాడ నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. సాంకేతిక ఆధారాలతో కేసులను ఛేదించారు.

ARREST
ARREST
author img

By

Published : Sep 4, 2021, 8:53 PM IST

ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఇందుకోసం మంచివారిలా నటిస్తూ చోరీలకు పాల్పడుతుంటారు. ఇక వీరి టార్గెట్.. వృద్ధులే..! ఇల్లు అద్దెకు కావాలంటూ ముందు మాట కలుపుతారు. అదును చూసుకుని వారిపై దాడి చేసి నగదు తీసుకుని ఉడాయిస్తారు. అడ్డుకుంటే దాడి చేస్తారు. ఇలా నగరంలో గత కొన్ని నెలలుగా వరుస చోరీలకు పాల్పడుతున్న ఘటనలు పోలీసులకు సవాల్ గా మారింది. వీరిపై నిఘా వేసిన పోలీసులు.. ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను విజయవాడ సీపీ బి. శ్రీనివాసులు తెలిపారు.

అసలు ఏం జరిగిందంటే..

విజయవాడ నగరంలో ఒంటరి వృద్ధ మహిళలు, దంపతులను లక్ష్యంగా చేసుకుని హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ పోలీసు స్టేషన్‌ పరిధిలోని కుందావారి కండ్రిక వద్ద గత నెల 26న మున్నంగి సుబ్బమ్మ(75) అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తి కిరాతంగా కొట్టారు.బాధితురాలు చికిత్స పొందుతూ మరణించిన కేసుపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టిసారించి దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ బాబూరావు బృందం శాస్రీయ ఆధారాలైన సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించడంతో చేధించారు.

వ్యసనాలకు అలవాటు పడి..

ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు ఒక వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఆ కోణంలో దర్యాప్తును కొనసాగించారు. వాంబే కాలనీకి చెందిన పల్లె రాము కేదారేశ్వరిపేటకు చెందిన తన స్నేహితుడు నాగరాజుతో కలిసి మూడు నేరాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడు పల్లె రాము గతంలో కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవాడని, రైలు ప్రమాదంలో ఒక కాలు కోల్పోయాడని సీపీ వివరించారు. నిందితుడు కృత్రిమ కాలు అమర్చుకుని తిరుగుతూ.. చెడు వ్యసనాలు తీర్చుకునేందుకు తేలికగా డబ్బు సంపాదించేందుకు నేరాలు చేయడం ప్రారంభించాడని చెప్పారు. ఈ క్రమంలోనే ఒంటిరిగా ఉన్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని వారితో పరిచయం పెంచుకుని బంగారు ఆభరణాలు దొంగతనం చేసినట్లు వెల్లడించారు.

ఇల్లు అద్దెకు కావాలంటూ..

ఈ ఏడాది ఫిబ్రవరి 26న పాయకాపురం ప్రాంతంలో సత్యవతి(80) అనే మహిళ ఇంట్లోనూ.. ఈ తరహా దొంగతనమే చేశారని పోలీసుల విచారణలో తేలింది. ఆభరణాలు అపహరిస్తున్న సమయంలో ఆమెను బలంగా నెట్టేయడంతో తలకు గాయమై చనిపోయిందని పేర్కొన్నారు. మార్చి 27న అజిత్‌సింగ్‌నగర్‌లో వెంకాయమ్మ(75) అనే మహిళను కూడా అద్దెకు ఇల్లు కావాలని అడగడానికి వెళ్లి.. బంగారు ఆభరణాలను దొంగిలించినట్లు సీపీ పేర్కొన్నారు. ఈ మూడు నేరాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

BUGGANA: ఇప్పటివరకు రూ.లక్షా 27 వేల కోట్లు అప్పు: ఆర్థికమంత్రి బుగ్గన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.