ETV Bharat / city

విజయవాడలో కరోనా పాజిటివ్.. 9 వార్డులపై ఆంక్షలు - విజయవాడలో కరోనా కేసు తాజా

విజయవాడలో 9 వార్డులను కంటైన్‌మెంట్ జోన్లుగా నగరపాలక సంస్థ ప్రకటించింది. కరోనా పాజిటివ్ కేసు నమోదైన పరిస్థితుల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. కంటైన్‌మెంట్ జోన్లుగా తూర్పు నియోజకవర్గంలోని 4, 5, 7, 8, 9, 10, 11, 14, 19 డివిజన్లు పూర్తిగా పోలీసుల పర్యవేక్షణలో ఉంటాయని తెలిపారు.

vijayawada-police
విజయవాడలో కరోనా పాజిటివ్ కేసు నమోదు... అధికారులు అప్రమత్తం
author img

By

Published : Mar 29, 2020, 11:25 AM IST

విజయవాడలో కరోనా పాజిటివ్ కేసు నమోదు... అధికారులు అప్రమత్తం

విజయవాడలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన పరిస్థితుల్లో.. కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం కఠిన చర్యలు ప్రారంభించింది. ఆ ప్రాంత పరిధిలోని భౌగోళిక ప్రాంతాలన్నిటినీ కంటైన్​మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4, 5, 7, 8, 9, 10, 11, 14, 19 డివిజన్లు సంపూర్ణంగా లాక్ డౌన్ పరిధిలో ఉండనున్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు.. ఆయా ప్రాంతాలకు ఎవరూ వెళ్లడం గానీ... అక్కడి వారు బయటకు రావడం, స్థానికంగా తిరగడం చేయకూడదు. అవసరమైన చోట్ల కరోనా పరీక్షలు నిర్వహించి... అనుమానితులను ఆసుపత్రిలో ఐసొలేషన్ వార్డుకు పంపుతారు. పోలీసు, ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బంది నిత్యం ఆ ప్రాంతాల్లో అందుబాటులో ఉంటారు. అక్కడికి కిలోమీటర్ పరిధిలో ఇప్పటికే 12 చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. 24 గంటలూ అక్కడ పోలీసులు కాపలా ఉండి ప్రజల కదలికలను గమనిస్తున్నారు.

మైకులతో ప్రచారం...

బెంజి సర్కిల్, కంట్రోల్ రూం సర్కిల్ సహా ఏలూరు రోడ్డు, బీఆర్​టీఎస్ రోడ్లలో మైకులు ఏర్పాటు చేసి... కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసులు నిరంతరం ప్రజలకు చెబుతున్నారు. కొంత మంది అపార్ట్​మెంట్లలో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారనే సమాచారం మేరకు వాటి నివారణపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.

క్వారంటైన్ వార్డులు వద్దు...

కృష్ణా జిల్లా కైకలూరు మండలం అటపాకలో జనావాసాల మధ్య క్వారంటైన్ వార్డులు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు అందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ అనుమానితుల కోసం.. గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని ఆధికారులు ప్రయత్నం చేయగా వారితో వాగ్వాదానికి దిగారు.

ఇవీ చూడండి:

లాక్​డౌన్​పై విశాఖ పోలీసుల ప్రచార చిత్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.