ETV Bharat / city

బ్యానర్ల చించివేతపై ఒకే పార్టీలోని ఇరువర్గాల రగడ - విజయవాడ కృష్ణలంక వైకాపాలో ఇరువర్గాల బాహాబాహీ

వైకాపాకు చెందిన రెండు వర్గాలు ఏర్పాటు చేసిన బ్యానర్లను పరస్పరం చించివేశారన్న ఆరోపణలతో.. ఇరుపక్షాలూ కృష్ణలంక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదులు చేసుకున్నాయి. కార్పొరేటర్ అభ్యర్థిత్వం దక్కలేదనే అక్కసు కారణంగా చేశారని ఒకరు.. దేవినేని అవినాష్ ఫొటో ముద్రించనందుకు చించివేశారని మరొకరు వాదనకు దిగారు.

flexy tearing issue
బ్యానర్​ చించివేత వివాదం
author img

By

Published : Dec 21, 2020, 8:21 AM IST

విజయవాడలోని కృష్ణలంక 21 వ డివిజన్​లో.. బ్యానర్ల చించివేతపై రగడ నెలకొంది. సీఎం జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని.. డివిజన్ వైకాపా కార్పొరేటర్ అభ్యర్థి పుప్పాల కుమారి, స్థానిక నాయకురాలు నిమ్మల జ్యోతికలు శుభాకాంక్షలు తెలపాలనుకున్నారు. కృష్ణలంక సర్వీసు రోడ్డు, హైస్కూల్​ రోడ్​లలో.. అభినందనల పేరుతో రెండు వర్గాలూ బ్యానర్లు ఏర్పాటు చేశాయి. ఆయా ప్రాంతాల్లో కట్టిన బ్యానర్లు ఆదివారం ఉదయం తొలగించి ఉండటంతో ఉద్రిక్తత నెలకొంది.

తూర్పు నియోజకవర్గ వైకాపా బాధ్యుడు దేవినేని అవినాష్ ఫొటోను ముద్రించలేదన్న నెపంతో.. ప్రత్యర్థి వర్గీయులు తమ బ్యానర్​ను తొలగించి, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీస్ స్టేషన్​లో నిమ్మల జ్యోతిక ఆరోపించారు. అంకిత భావంతో పార్టీకి సేవలందిస్తున్నా.. తమను వేధింపులకు గురిచేయడం ఆవేదన కలిగిస్తోందని పేర్కొన్నారు.

కార్పొరేటర్ అభ్యర్థిత్వం తమకు దక్కలేదన్న అక్కసుతో.. ప్రత్యర్థి వర్గమే తమ బ్యానర్లను చించివేసి, పేడ చల్లినట్లు పుప్పాల కుమారి ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల వాదనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఘటనపై విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:

దక్షిణ మధ్య రైల్వేకు 3 ఇంధన పొదుపు జాతీయ అవార్డులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.